AP and TS / Entertainment
అదే నా ప్రపంచం.. నేను చెప్పిందే...
46 days ago

వెంకటేష్- రితికాసింగ్ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ ‘గురు’. సంక్రాంతి సందర్భంగా యూనిట్ చిన్న టీజర్‌ని విడుదల చేసింది. 41 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో కోచ్‌గా విక్టరీ యాక్టింగ్ సూపర్బ్‌గా వుందని అంటున్నారు సినీలవర్స్.

బాలీవుడ్‌లో హిట్టయిన ‘సాలా ఖడూస్‌’కి రీమేక్ గురు‌. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో హిందీలో మాదిరిగానే తెలుగులోనూ రితికాసింగ్‌ కీలక పాత్ర పోషించనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.

 

 
 
 
Related News

JournalistDiary