India / Sports
ఒకర్ని బలి తీసుకున్న టీమిండియా
123 days ago

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో జరిగిన పరాభవం నుంచి టీమిండియా అభిమానులు ఇంకా తేరుకున్నట్లు లేరు. ఆటగాళ్ల ఫ్లెక్సీలు తగలబెట్టడం, టీవీలు పగలగొట్టడం లాంటి చర్యలతో కసి తీర్చుకుని కాకెత్తిపోయిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇప్పట్లో చల్లబడే వాతావరణం కనిపించడం లేదు.

తీవ్ర మనస్తాపంతో..  మర్నాడు తమ సొంత పనుల్ని కూడా మానేసుకుని కుమిలిపోతున్న వీరాభిమానులు కూడా వున్నారు. ఇటు.. పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక ఒక అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు వార్తలొస్తున్నాయి. బంగ్లాదేశ్‌ లోని జమాల్‌పూర్‌కు చెందిన బిద్యుత్ అనే పాతికేళ్ల కుర్రాడు.. రైలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆదివారం లండన్‌లోని ఓవల్‌ గ్రౌండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే!

 

Read Also

 
Related News
JournalistDiary