AP and TS / Entertainment
జబర్దస్త్ నుంచి రష్మి ఔట్.. హరితేజ ఇన్ ?
8 days ago

ఒక ఐడియా జీవితాన్నే మార్చినట్టు.. ఒక టీవీషో ఎందరికో లైఫ్ ఇస్తోంది. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా.. జబర్దస్త్ షో పాపులారిటీ తగ్గలేదని రేటింగ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. బిగ్‌బాస్ షో స్టార్ట్ అయ్యాక జబర్దస్త్ హవా కాస్త తగ్గినా.. ఐదారువారాల తర్వాత మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేసింది. అసలు విషయానికొస్తే జబర్దస్త్ షో‌కు యాంకర్‌గా రష్మి ప్లేస్‌లో హరితేజ ఎంట్రీ ఇస్తోందంటూ ప్రచారం సాగుతోంది.

టీవీ యాంకర్‌గా ‘అ ఆ’ సినిమాతో పాపులర్ అయ్యి బిగ్‌బాస్‌లో ఫైనలిస్ట్ వరకూ వెళ్లిన హరితేజ‌కు జబర్దస్త్ యూనిట్ వెల్‌కమ్ చెబుతోందని సమాచారం. రష్మి అటు సినిమాలు, ఢీ వంటి షోలు, ఈవెంట్స్‌తో బిజీకావడంతో న్యూలుక్ తేవడం కోసం హరితేజ‌ను రీప్లేస్ చేస్తున్నారని స్మాల్ స్క్రీన్ టాక్.

 

Read Also

 
Related News
JournalistDiary