India / Entertainment
దావూద్‌ చెల్లెలు బయటకు వచ్చింది
123 days ago

శ్రద్ధాకపూర్‌ న్యూఫిల్మ్ ‘హసీనా - ది క్వీన్ ఆఫ్ ముంబై’. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ టీజర్‌ని రిలీజ్ చేశారు. నిమిషం నిడివిగల ప్రాంతంలో ఒక్క డైలాగ్‌తో శ్రద్ధ అదరగొట్టేసింది. అసలు విషయాన్నికొస్తే అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ స్టోరీ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు హసీనా అంటే ముంబైలోని నాగ్‌‌పాడా ఏరియాలో ‘ఆపా’ అని పిలిచేవారు. సింపుల్‌గా టీజర్‌లో హసీనాను గాడ్‌ఉమెన్‌గా చూపించాడు డైరెక్టర్ అపూర్వాలఖియా. శ్రద్ధా చెప్పిన డైలాగ్ ‘ఆపా గుర్తుంటే చాలు.. పేరు గుర్తుంచుకోనక్కర్లేదు’ హైలైట్‌గా నిలిచింది. దావూద్‌ క్యారెక్టర్‌లో సిద్ధాంత్‌‌ కపూర్‌ నటిస్తున్నాడు. అంతా రైట్ టైమ్‌లో చిత్రీకరణ జరిగితే ఆగష్టు 18న హసీనాను రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

 

Read Also

 
Related News
JournalistDiary