India / Crime
అమెజాన్‌కి కన్నం.. 166 సార్లు మోసం.. 52 లక్షల నష్టం..
9 days ago

పని పాటా లేని 21 ఏళ్ల యువకుడి బుద్ది పక్కదారి పట్టింది. దీంతో తన నెగిటివ్ ఆలోచనకు పదునుపెట్టి చివరకు ఆన్‌లైన్
రిటైల్ సంస్థ అమెజాన్‌కు టెండర్ పెట్టాడు. కేవలం రెండు నెలల్లో 52 లక్షల నష్టం చేకూర్చి అడ్డంగా బుక్కయిపోయాడు.
21 ఏళ్ల కుర్రాడి పేరు శివమ్ చోప్రా.. ఉత్తర ఢిల్లీలోని హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. కానీ సరైన నైపుణ్యం లేకపోవడం
తో ఉద్యోగం సాధించడంలో ఫెయిలయ్యాడు. దీంతో తనకు వచ్చిన ఆలోచనకు పదునుపెట్టాడు. ఇంతకీ ఆ థాట్ ఏంటంటే..


అమెజాన్ నుంచి ఖరీదైన ఫోన్లు ఆర్డర్ చేసేశాడు. అవి వచ్చిన తర్వాత రిఫండ్ కోరేవాడు. ఆ తర్వాత డబ్బులు వీడి ఖాతాలో జమయ్యేవి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 166 సార్లు ఖరీదైన ఫోన్లను ఆర్డర్ చేశాడు. కేవలం రెండు నెలల (ఏప్రిల్, మే) వ్యవధిలోనే! శివమ్ చేసిన ఈ పనికి అమెజాన్‌కు దాదాపు నష్టం రూ. 50 లక్షలు. చివరకు ఆ సంస్థ ఈ విషయమై పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులకు తీగలాడితే డొంకంతా కదిలింది. యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల హైఎండ్ ఫోన్లను వేరేవేరే ఫోన్ నంబర్లు, చిరునామాల నుంచి ఆర్డర్ ఇచ్చేవాడు. సిమ్ కార్డులను సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్న టెలికాం షాప్ ఓనర్‌ని వినియోగించుకున్నాడు.

ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌ల సహాయంతో ప్రొడక్టులను శివమ్ కొనేవాడు. తప్పుడు చిరునామాతో తొలుత ఆర్డర్ చేసేవాడు. ఆపై సదరు ప్రొడక్టు డెలివరీ చేసేందుకు వచ్చే బాయ్‌కి తాను మరోచోట వున్నానని డ్రామాకు తెరలేపేవాడు. ఒకసారి చిరునామా మారిందని, మరోచోట ఫలానా ప్రాంతానికి రావాలని చెప్పి డెలివరీ తీసుకునేవాడు. డెలివరీ బాయ్ వెళ్లగానే, తన ఫోన్ నుంచి అమెజాన్‌కు కాల్ చేసి ఖాళీగావున్న ఫోన్ డబ్బా తనకు ఇచ్చి వెళ్లారని ఫిర్యాదు చేసేవాడు. అప్పటికే శివమ్ డబ్బులు చెల్లించినట్టు వారి వద్ద సమాచారం ఉండడంతో వెంటనే రిఫండ్ ఇచ్చేవారు. అలా శివమ్ నుంచి 19 మొబైల్ ఫోన్లు, 12 లక్షల నగదు, 40 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్కులు సీజ్ చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary