World / Health
తొక్కే కదా అని తీసి పారేశారో?
695 days ago

ఈ కథనం చదివిన తరువాత ఇక మీరు ‘ఆ.. తొక్కలోది’ అనే మాట అనాలంటే కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది మరి. తొక్కే కదా అని తీసి పారేయకండి. అరటి పండుకంటే తొక్కలోనే  ఎక్కువ బలముంటుందని అంటున్నారు శాస్ర్తవేత్తలు. అరటిపండు తొక్కలో  అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉన్నాయట. ఈ తొక్కతో వారానొకొకసారి  పళ్ల మీద రుద్దితే పలువరుస నిగనిగలాడిపోతుందట. అంతే కాకుండా డెంటిస్ట్‌ను సంప్రదించాల్సిన అవసరం కూడా రాదట.  

తొక్కతో మొటిమల మీద రుద్దితే  ఒక్క రాత్రిలో మటుమాయం అవుతాయట. అలాగే ఎగ్‌‌వైట్‌‌లో అరటిపండు తొక్కతో గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అయి నిగనిగలాడటమే కాకుండా డ్రై‌స్కిన్ బాధ తప్పుతుందని అంటున్నారు. నొప్పులు, వాపులు ఉన్న చోట అరటిపండు తొక్క గుజ్జుగా చేసి దానికి వెజిటబుల్ ఆయిల్ కలిపి మసాజ్ చేస్తే అవి మాయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు సోరియాసిస్ వ్యాధితో వచ్చే దురదలతో బాధపడేవారు కూడా అరటిపండు తొక్క గుజ్జును దురదల ప్రాంతంలో పట్టిస్తే రిలీఫ్ ఉంటుందట. అలాగే దోమకాటువల్ల వచ్చే అలర్జీలు, దురదలు వచ్చేచోట అరటిపండు తొక్క గుజ్జును రాస్తే ఉపశమనం పొందవచ్చుననికూడా పరిశోధకులు చెబుతున్నారు. సో.. ఇవీ..  తొక్కలోని ఆరోగ్య రహస్యాలు.


 
 
Related News