AP / Entertainment
ఎన్టీయార్ గురించి నీకేం తెలుసు? సోమిరెడ్డితో బస్తీ మే సవాల్! తొడగొట్టిన వర్మ!
8 days ago

మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది! సగటు రాజకీయనాయడికి సినిమావాళ్ళ నుంచి వర్మ తాజా హెచ్చరిక ఇది! 'లక్ష్మీస్ ఎన్టీయార్' మూవీ నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చేసిన కామెంట్స్ కి రామ్ గోపాల్ వర్మ సీరియస్ కౌంటర్స్ ఇచ్చారు. ఎన్టీయార్ గురించి నీకెక్కువ తెలుసా నాకెక్కువ తెలుసా తేల్చుకుందాం రమ్మంటూ ఛాలెంజ్ కూడా విసిరారు. ''My replies to the great honourable TDP agriculture minister మర్యాద తిమ్మన్న సోమిరెడ్డి గారి comments'' అంటూ వర్మ ఫేస్ బుక్ పోస్ట్ పూర్తి పాఠం ఇది!

  

మినిస్టర్ సోమి :
NTR జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరో గా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం
నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి

 

RGV:
సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పాడుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా

 

మినిస్టర్ సోమి :
లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది . అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా..

 

RGV:
అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ, హీరోయిన్లపై మీ ఈ insulting కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లు మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత అతి&@“?:(@@వాళ్ళు ..నేను దీని అర్థం చెప్పను. ఎందుకులే ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!!!

 

మినిస్టర్ సోమి :
ఎన్ టి ఆర్ గురించి నాకు తెలిసినంతగా రాంగోపాల్ వర్మకు తెలియదు

 

RGV:
మై డియర్ సోమి ,ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని ?

 

మినిస్టర్ సోమి :
రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నారు

 

RGV:
సోమి ,రాజకీయ ఉద్దేశాలు ఏమి లేకుండానే రాజకీయ నాయకుడివి అయ్యావా .....ఆలా అయితే nee N కి నా నమస్కారం. N ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ..N అంటే nee నోరు

 

మినిస్టర్ సోమి: political reasons కోసమే ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాతగా వున్నారు

 

 

RGV: ఛా! మా నాయనే... నీ ఇల్లు బంగారం గాను... చిన్నప్పటి నుండి ఇన్ని తెలివితేటలా సార్.. 😘😘😘 వావ్😍😍😍

 

మినిస్టర్ సోమి :
ఎన్ టి ఆర్ చరిత్రను వక్రీకరించి కేవలం లక్ష్మీ పార్వతి కోణంలోనే సినిమా తీస్తే ప్రజలు ఒప్పుకోరు..

 

RGV:
ఓహ్ సార్ ఈ మాట కోట్ల ప్రజలు ట్రైన్లలో, బస్సుల్లో మీ ఇంటికొచ్చి మీ చెవిలో చెప్పారా సార్ ..Soooo wonderfulll😍😍Want to sooooo kiss u 😘😘😘

 

మినిస్టర్ సోమి :
రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా గురించి మేము భయపడటం లేదు

 

RGV: భయపడనప్పుడు ఇంత అరవాల్సిన అవసరం ఏముంది రెడ్డి గారు ? Just asking? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఉందంటారా సార్ ?

 

మినిస్టర్ సోమి :
రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాస్తవమ్ తీయమని అంటున్నా...

 

RGV: అబ్బబ్బో మీకు నాకన్నా ఎక్కువ వాస్తవాలు తెలుసని మీరు అంటుంటే ఆ రోజుల్లో తలుపెనక నక్కి ఉండేవారా లేక మంచం కింద దాక్కునేవారా? ...రెడ్డిగారు చెప్పండి ప్లీజ్ ..మేము మీ గాసిప్ కోసం తహతహలాడిపోతున్నాము.

 

చివరగా నాకన్నా ఎక్కువ NTR గారి గురించి తెలుసన్న సోమిరెడ్డి గారికి నా open challenge ఏమిటంటే TV లో Open Debate కి రమ్మని ..సోమిరెడ్డి గారు మీరు ఫ్రీ ఉన్నపుడు ముంబైలో నా అన్ని పనులు మానుకొని debate కి వస్తా ..టైము ప్లేసు మీరే చెప్పండి సార్

 

------------------------------------------------

వర్మ సవాల్‌ని సోమిరెడ్డి తిప్పికొట్టారు. మీతో బహిరంగ చర్చకి నేను కాదు.. నా పాలేరు కూడా రాడు అంటూ తీవ్రంగా స్పందించారు. నీ తెలివితేటలన్నీ నువ్వు తీయబోయే సినిమా మీద ప్రయోగించుకో అన్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary