India / Entertainment
నిర్మాత సురేష్‌పై నటి ఆరోపణలు
135 days ago

షార్ట్ ఫిల్మ్, బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అవంతిక. గ్లామర్ ఇండస్ర్టీలో తనకు
జరిగిన అన్యాయంపై ఈమె గొంతువిప్పింది. ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేసింది. ‘రాజు కన్నడ
మీడియం’ చిత్రం ప్రొడ్యూసర్ సురేష్‌పై నటి అవంతిక శెట్టి చేసిన ఆరోపణలు ఇండస్ర్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

 

తన గురించి అవాస్తవాలను పత్రికలో నిర్మాత సురేష్ రాయించాడని, తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఉండటంతో
ఆందోళన చెందాల్సివచ్చిందని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది అవంతిక. తన కెరీర్‌కు ముప్పు కలిగించేలా నిర్మాత
వ్యవహరించాడని, పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి వేధిస్తున్నారని తెలుసుకుని సహనంతో వ్యవహరిస్తూ వచ్చానని
వెల్లడించింది. ‘రాజు కన్నడ మీడియం’ తొలి షెడ్యూల్ నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయని, మంచి నటనను ఇచ్చేందుకు కష్టపడ్డానని, బ్యాంకాక్‌లో తనతో దారుణంగా ప్రవర్తించాని గుర్తుచేసింది. చెక్కులు ఎందుకు బౌన్స్ అయ్యాయని నిలదీయగా, తనను ముంబై పంపించారని పేర్కొంది. నటిస్తున్న మూవీకి ఇప్పటివరకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదని, తనతో డబ్బింగ్ చెప్పకుండానే సినిమాని రిలీజ్ చేయాలని చూశారని ఆరోపించింది. చేసిన మోసంపై కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలియజేసింది.

 

Read Also

 
Related News
JournalistDiary