AP and TS / Entertainment
నయన్‌ని ఫాలో అవుతోన్న రితికా
8 days ago

బాక్సింగ్‌ బ్యూటీ రితికాసింగ్‌కి గురు, శివలింగం మూవీల తర్వాత టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చేసింది. ఆ రెండు సినిమాలు సక్సెస్
అయినా ఆమెకి స్టార్ హీరోల పక్కన ఇంతవరకూ ఆఫర్ రాలేదు. దాంతో తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి హీరోయిన్ సెంట్రిక్
మూవీలో నటించబోతోందట.

 

ఈ మధ్య తమిళంలో నయనతార ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టింది. దీంతో ఒక్కో సినిమాకి
మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్ పొజిషన్‌లో వుంది. ఇప్పుడు రితికా కూడా నయన్‌ని ఫాలో
అవుతూ హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలు చేయడానికి రెడీ అవుతోందంటున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్
లో రితికా.. ఓ క్యాబ్ డైవర్ రోల్లో కనిపించనుందట. మరి నయనతార మాదరిగా బాక్సింగ్‌బ్యూటీ సక్సెస్ అవుతుందో లేదో
చూడాలి.

 

Read Also

 
Related News
JournalistDiary