AP / Entertainment
సెల్ఫీల మోజులోపడి...
309 days ago

సెల్ఫీల పిచ్చి యూత్‌ని వదల్లేదు. చివరకు ప్రాణాల మీదకు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అలాంటి ఘటన విజయవాడలో వెలుగుచూసింది. 15 ఏళ్ల వరద రాజులు అనే యువకుడు సెల్ఫీ పిచ్చిలోపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన బయటపడింది. కృష్ణాజిల్లా మధురానగర్‌ ఏరియాలోని పప్పుల మిల్లు రైల్వేగేటు వద్ద వుంది.  సోమవారం సాయంత్రం మచిలీపట్నం ప్యాసింజర్‌ వస్తుండడంతో గేటు పడింది.

అక్కడేవున్న మాచవరానికి చెందిన పదో తరగతి స్టూడెంట్ వరదరాజులు.. ట్రాక్‌ పక్కన నిలబడి వెనుక నుంచి రైలు వస్తుండగా, చేతితో ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేశాడు. ఐతే, రైలు ఇంజిన్‌ వెడల్పుగా ఉండడంతో అది రాజుల చేతికి తగలడం, ఎగిరిపడ్డాడు. ఈ ఘటన‌లో వరదరాజులకు కాలు విరగడంతోపాటు ముఖం, ఒంటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్నవారు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు కొద్దిసేపు రైలుని ఆపివేశారు. 

 

Read Also

 
Related News
JournalistDiary