India / Crime
పంచకుల అల్లర్ల రోజు ఏం జరిగిందంటే..
9 days ago

హర్యానాలోని పంచకుల ప్రాంతంలో జరిగిన అల్లర్లకు తాను కారణమని అంగీకరించింది గుర్మీత్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌
సింగ్‌. గుర్మీత్‌ కోర్టుకెళ్లిన రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లకు గైడ్‌ మ్యాప్‌లు తయారు చేసింది తానేనని, ఇందుకు
డేరాలోని శాఖలు సహకరించాయని విచారణలో వెల్లడించింది. ఈ అల్లర్ల కోసం ఆమె ఏకంగా కోటికిపైగానే నిధులు ఖర్చు
చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. హనీప్రీత్‌ ఇచ్చిన సమాచారాన్ని ల్యాప్‌టాప్‌లో భద్రపరిచారు పోలీసులు.


గుర్మీత్‌కు శిక్షపడిన తర్వాత భారీగా నగదును తరలించారని, వాటి వివరాలు హనీప్రీత్‌ ల్యాప్‌ట్యాప్‌లో ఉండే అవకాశం
ఉందని భావిస్తున్నారు. గతంలో ఈ అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న హనీప్రీత్‌.. తొలుత విచారణ టైమ్‌లో దీని
గురించి నోరు విప్పలేదు. ఇప్పటికే పోలీసుల కస్టడీలోవున్న డేరా అనుచరులు.. అల్లర్లలో ప్రధాన సూత్రధారి హనీప్రీతేనని
చెప్పిన వీడియోలను ఆమె ముందు వుండడంతో చేసేది లేక ఒప్పుకుంది. ప్రీత్‌సింగ్‌కు మరో మూడురోజులు పోలీసుల కస్టడీని పొడిగించారు.

 

Read Also

 
Related News
JournalistDiary