World / Health
బటర్ చికెన్ బర్త్ సీక్రెట్..
274 days ago

ఇండియాలో నావ్ వెజ్ డిషెస్ లో అత్యంత డిమాండ్ కలిగిన డిష్ ఏదీ అంటే  బటర్ చికెనే.. చికెన్ ను చిన్న ముక్కలుగా చేసి.. వెన్న,మీగడలు కలిపి వాటికి కట్ చేసిన టొమాటో  ముక్కలు.తగినంత కారం.,ఆకలి  పుట్టించేూ  మసాలాలు కలిపి  వేడివేడిగా ప్లేట్లలో వడ్డించే బటర్ చికెన్   రుచే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత టేస్ట్ , ఆదరణ  కలిగిన బటర్ చికెన్  అసలు పుట్టిందెక్కడ? రుచి వెనుక రహస్యం ఏమిటని ఆరా తీస్తే..దీనికి  వందేళ్ల చరిత్ర  ఉన్నట్టు తేలింది.

పెషావర్ లోని  గోరాబజార్లో  నివాసముండే మోకాసింగ్ అనే వ్యక్తికున్న   చిన్న రెస్టారెంట్ లో  చెఫ్ గా పనిచేసే కుందన్ లాల్ గుజ్రాల్  అనే వ్యక్తి దీనికి ఆధ్యుడిగా  తేల్చారు.రొట్టెలు కాల్చినట్టుగా చిన్న ముక్కలుగా చేసిన చికెన్ తండూరి పొయ్యిలో  కాల్చి వడ్డించేవాడు.  సో.. అలా గుజ్రాల్ వంటచేస్తూ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. చికెన్ ను మట్టి పాత్రలో  కట్టెలపొగ మీద వండడం  వల్ల  ఆ చికెన్  మంచి టేస్ట్  సంతరించుకునేంది. ఈ క్రమంలోగుజ్రాల్1947 లో   పాకిస్థాన్  నుంచి  విడిపోయి ఇండియాకు  వచ్చాడు. ఢిల్లీలో నివాసముంటూ దరియాగంజ్ లో ఉన్న మోతీ మహల్ ధాబాలో  కొత్త రెస్టారెంట్లో చెఫ్ గా  కుదిరాడు.అయితే అక్కడ ఫ్రిజ్  సౌకర్యం లేకపోవడంతో  మిగిలిన చికెన్ పాడవకుండా  ఎలా వాడాలా అని ఆలోచించాడు. మిగిలిన తండూరి టిక్కాలకు టొమాటో గ్రేవీ,బట్టర్ క్రీమ్  కలిపి వడ్డించడంతో దానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. అదిగో .. అలా పుట్టింది బటర్ చికెన్..


 
 
Related News