India / Crime
హైదరాబాద్ ‘బ్లాక్’ బిజినెస్‌మేన్ అరెస్ట్
297 days ago

ఎట్టకేలకు హైదరాబాద్‌కి చెందిన ‘బ్లాక్’ బిజినెస్‌మేన్ కైలాశ్‌చంద్‌ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. నోట్ల రద్దు ప్రకటన రోజు నవంబర్ 8న రాత్రి మూడు గంటల వ్యవధిలో బోగస్‌ పత్రాలు క్రియేట్ సుమారు వంద కోట్ల రూపాయలను వైట్‌గా మార్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గుప్తా. ఈ వ్యవహారంపై ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థలైన ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెలర్స్, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేసుకు నమోదైంది. ఇందుకు సంబంధించి డైరెక్టర్‌గావున్న గుప్తాను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

నవంబర్ రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల మధ్య దాదాపు 5,200 మంది వినియోగదారులు..  రూ.97.85 కోట్ల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌ రసీదులు సృష్టించారు. దీని ద్వారా బ్లాక్‌మనీని హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు మళ్లించారు. ఈ తతంగంపై ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైన తర్వాత గుప్తా, సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డుల్ని ఎప్పటికప్పుడు మార్చేస్తూ తప్పించుకుని తిరుతుగున్నారు. చివరకు మణికొండలోని ఆశ్రయం పొందుతున్నాడని సమాచారం అందుకున్న సీసీఎస్‌ పోలీసులు, కైలాశ్‌ గుప్తాని, ఆశ్రయం కల్పించిన అతడి మరో వ్యాపారవేత్త నరేందర్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. ముసద్దీలాల్‌ సంస్థలకు కైలాశ్‌ ఆయన కొడుకులు నితిన్‌గుప్తా, నిఖిల్‌గుప్తా, కోడలు నేహాగుప్తాలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌- ఆర్‌వోసీ రికార్డులను తారుమారు చేశారని పోలీసులు పేర్కొన్నారు. గుప్తాను బుధవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

 

Read Also

 
Related News
JournalistDiary