India / General
ఝార్ఖండ్ మదపుటేనుగు.. హైదరాబాదీ వేటగాడు..
69 days ago

ఆగస్టు 12, వరల్డ్ ఎలిఫెంట్ డే.. ప్రపంచ ఏనుగుల పండగ. కానీ.. జార్ఖండ్ లోని ఒక ఏనుగుకు మాత్రం ఆ రోజే మూడింది. వివరాల్లోకెళితే.. అనగనగా ఒక ఏనుగు. ఝార్ఖండ్ లోని సాహిబ్ ఘంజ్ అడవుల్లో మదమెక్కి తిరుగుతోంది. అక్కడుండే ట్రైబల్ ఏరియాల్లోకి జొరబడి.. గ్రామస్తుల ఉసురు తీయడం అలవాటుగా మార్చుకుంది. ఏప్రిల్ నెలలో బీహార్లో నలుగుర్ని పొట్టనబెట్టుకుని.. ఇప్పుడు ఝార్ఖండ్ అటవీ అధికారుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటివరకు 15 మందిని తొక్కి చంపింన ఈ మదపుటేనుగుకు స్పాట్ పెట్టెయ్యాలని ఝార్ఖండ్ పశు సంవర్థక శాఖ డిసైడైంది.

మంద నుంచి విడిపడి.. దారి తప్పి దిక్కుతెలియని స్థితిలో పడ్డం వల్లే ఆ ఏనుగు ఇలా జనం మీద కసి పెంచుకుందని చెబుతున్నారు. వారం రోజుల పాటు తమ స్పెషల్ టీమ్స్ వేటాడినా దొరకలేదని, ఆ కారణంగానే సదరు మదగజాన్ని చంపడానికి నిర్ణయించామని వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఎల్ ఆర్ సింగ్ చెబుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ కి చెందిన షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ ఆలీ ఖాన్ తో కాంట్రాక్టు కూడా ఖరారైంది.

కొండలుగుట్టలు, చెట్ల పొదలతో నిండి, చుట్టూ చూస్తే 15 అడుగుల కంటే దూరం కనిపించనంత దట్టమైన అడవుల్లో ఆ ఏనుగు ఉనికిని పసిగట్టి మట్టుబెట్టడమంటే మాటలు కాదు. కానీ ఈ హైదరాబాదీ ఖాన్ మాత్రం తుపాకీ పట్టుకుని వేటకు దిగేశాడు. ఎందుకంటే.. వన్యమృగాల వేటలో ఈ అలీ భాయ్ ట్రాక్ రికార్డ్ అటువంటిది. 2014లో ఎనిమిది మందిని తిన్న ఒక పులిని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు చెరబట్టి బోనులో నిలబెట్టింది కూడా ఇతడే. ఇప్పుడు.. ఝార్ఖండ్ లో రెచ్చిపోతున్న ఆ మదపుటేనుగు కథకు సైతం క్లయిమాక్స్ రాసేశాడు. ఆపరేషన్ మొదలుపెట్టిన కొన్ని గంటల్లోపే.. దాన్ని పసిగట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపేశాడు.

 

Read Also

 
Related News
JournalistDiary