Telangana / Crime
డ్రగ్స్ కేసు: రిపోర్ట్ రాగానే.. నటీనటులపై చర్యలు
10 days ago

హైదరాబాద్ డ్రగ్స్ కేసు స్పీడందుకుంది. నటీనటుల విచారణ తర్వాత ఈ కేసు నీరుగారిపోయిందని వార్తల నేపథ్యంలో ఆ
ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పందించారు. తాము విచారించిన డ్రగ్స్ కేసులో చార్జ్‌షీట్‌లను సిద్ధం చేశామని,
ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగానే న్యాయస్థానంలో దాఖలు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్శిటీలో ‘డ్రగ్స్ ఫ్రీ
నేషన్’ పేరిట ఓ కార్యక్రమానికి అకున్ సబర్వాల్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ కేసులో విచారణ ఆగిపోలేదని, పారదర్శకంగా ముందుకు సాగుతోందని, ఈ విషయంలో తమపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవన్నారు. సెప్టెంబర్ తర్వాత ఈ కేసులో చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రక్త నమూనాలు తీసుకున్న నటీనటుల రిపోర్టులను పరిశీలించిన తర్వాత వారిపై చర్యలుంటాయని తెలిపారు.

 
 
Related News