India / Crime
ఇప్పటికీ నేనే చీఫ్ సెక్రటరీని
299 days ago

రెండురోజులపాటు ఆదాయపు పన్ను అధికారుల సోదాల తర్వాత తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్‌రావు మీడియా ముందుకొచ్చారు. తన ఇంట్లో దొరికిన అన్ని వివరాలను ఆయన మీడియాకు అందజేశారు. ఇదే సమయంలో కేంద్రంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తన హక్కులకు భంగం కలిగించారని ఆరోపించిన ఆయన.. చీఫ్ సెక్రటరీ కార్యాలయం మీద సోదాలు..  రాజ్యాంగంపై దాడి చేయడమేనని అన్నారు. ప్రభుత్వానికి తనను బదిలీ చేసే దమ్ములేదంటూనే.. పురచ్చితలైవి తనను చీఫ్ సెక్రటరీగా నియమించారని, ఆమె బతికుంటే ఆఫీసు, నివాసంలో అడుగుపెట్టే ధైర్యం ఎవరైనా చేసేవారా అని ప్రశ్నించారు.

సెర్చ్ వారెంట్ వుంటే తన నివాసం, ఆఫీసులను తనిఖీ చేసే అధికారం సీఆర్పీఎఫ్‌కు ఎవరిచ్చారని కుండబద్దలు కొట్టారు రామ్మోహన్‌రావు. ఒకవేళ సోదాలు చేయాలనుకుంటే... తనను బదిలీ చేసిన తర్వాతే నిర్వహించాలని, 32 ఏళ్ల పాటు సర్వీసు చేసిన తనకే ఇలావుంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. శేఖరరెడ్డికి సంబంధించిన ఏ లావాదేవీలోనూ తాను జోక్యం చేసుకోలేదని, తన కొడుకుతో అతనితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. తన కొడుకు విదేశాల్లో ఉంటాడని, తనతో లేడన్నారు. తనను హౌస్ అరెస్టు చేశారని ఆరోపించిన ఆయన.. తనకు ట్రాన్సఫర్ ఆర్డర్స్ ఇచ్చే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని దుయ్యబట్టారు.

తాను ఇప్పటికీ తమిళనాడు చీఫ్ సెక్రటరీనేనని, ప్రస్తుతం ఉన్నది ఇన్‌ఛార్జి సీఎస్‌ అని గుర్తు చేశారు. అసలు సెర్చ్ వారెంట్‌లో తన పేరు లేదని ఇంట్లో 1,12,320 రూపాయలు మాత్రమే వున్నాయన్నారు. భార్య, కూతురు పేరిట 40 తులాల బంగారం, 25 కేజీల దేవుళ్ల విగ్రహాలు సీజ్ చేశారు. మరోవైపు అధికారుల సోదాలను నిరసిస్తూ తనకు మద్దతు పలికిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

 

Read Also

 
Related News
JournalistDiary