World / Crime
ఆమె తల ఖరీదు 7కోట్లు
242 days ago

జోవన్నా పాలని అనే మహిళ తలకు సుమారు 7కోట్ల రూపాయలు ఖరీదు కట్టింది ఉగ్రమూక ఐఎస్ఐఎస్. ఆమె తలను నరికి ఇచ్చిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తామంటూ తన సోషల్ మీడియా వేదికలద్వారా ప్రకటించింది. ఇంతకీ కుర్దిష్- డేనిష్ మహిళ అయిన 23ఏళ్ల  పాలని చేసిన పాపంఏంటంటే.. మహిళల హక్కులకోసం పోరాడటమే.  సిరియా-ఇరాక్ లోని టెర్రర్ గ్రూప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతోన్న పాలని ప్రస్తుతం కోపెన్ హెగన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. జూన్ 2015 లో ఆమెపై 12 నెలల దేశం విడిచి వెళ్లరాదంటూ నిషేధం విధించారు. దీనిని ఉల్లంఘించారన్న ఆరోపణలు రుజువైతే ఆమెకు రెండేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఈలోగానే ఐఎస్ఐఎస్ పాలని కి వ్యతిరేకంగా వికటాట్టహాసం ప్రారంభించింది.  

 
 
Related News