India / Crime
చీఫ్ సెక్రటరీ ఇంట్లో ఎంత దొరికిందంటే..
127 days ago

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంటిపై బుధవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. చెన్నై  అన్నానగర్‌‌లోని ఆయన నివాసంతోపాటు మరో ఆరు చోట్ల దాడులు చేశారు. 18 లక్షల కొత్త నోట్లు, 2 కేజీల బంగారం లభించినట్టు అధికారులు వెల్లడించారు. రామ్మోహనరావు కొడుకు, బంధువుల ఇళ్లలో ఈ మొత్తం లభించినట్టు సమాచారం.

టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. అక్కడ లభించిన పత్రాల్లో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు కనిపించిందని, ఈ నేపథ్యంలో సమన్లు జారీ చేసి ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. 

 

 
 
 
Related News

JournalistDiary