India / General
అమ్మాయిగా మారిన నేవీ అబ్బాయిపై..
9 days ago

అమ్మాయిగా మారిన ఓ నౌకాదళ సెయిలర్ పై విశాఖలోని భారత నౌకాదళ అధికారులు కొరడా ఝులిపించారు. తమకు తెలియపర్చకుండా లింగమార్పిడి చేసుకున్నాడంటూ మనీష్‌కుమార్‌ గిరి అలియాస్‌ సబి గిరిని ఉద్యోగం నుంచి తొలగించారు. సొంత అభీష్టం మేరకే సబిగిరీ లింగమార్పిడి చేయించుకుందని, భారత నౌకాదళ నిబంధనల ప్రకారం ఆమె (లేదా అతడిని) ఉద్యోగంలో కొనసాగించడం కుదరదని నేవీ వివరణ ఇచ్చింది.

ఏడేళ్ల క్రితం విశాఖపట్నంలో నేవీ సెయిలర్‌గా చేరిన మనీష్‌కుమార్‌ గిరి కొన్ని నెలల కిందట 22 రోజుల సెలవు తీసుకున్నాడు. ఈ సమయంలో అతడు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా 'లింగ మార్పిడి' ఆపరేషన్‌ చేయించుకొని.. సబీగా మారాడు. అనంతరం విధులకు హాజరయ్యాడు. తిరిగి చేరిన తర్వాత అతని ప్రవర్తనలో మార్పు రావడంతో అధికారులు ఆరాతీసి చర్యకు ఉపక్రమించారు. అయితే, శరీరంలో అవయవాలు మారాయన్న కారణంతో తాను 'అన్‌ఫిట్‌' అని ముద్రవేసి జాబ్ నుంచి తీసేయడంపై సుప్రీంకోర్టుకు వెళుతానని సబిగిరీ చెబుతున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary