Telangana / Politics
'ఆఖరి పోరాటం' కేసీయారే టార్గెట్
114 days ago

విలన్లందరూ ఒక్కటయ్యారని, హీరో కేసీయారే టార్గెట్ గా కత్తులు నూరుతున్నారని మీడియాలో ఒక వార్త రొటేట్ అవుతోంది. మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన చివరిదాకా పోరాడిన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో.. జాయింట్ యాక్షన్ కమిటీ కొత్తగా రూపుదిద్దుకుంటోందన్నది ఆ వార్త సారాంశం. కేసీఆర్ ని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని భావించిన తెలంగాణా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఒక 'మంచి డయాస్' కోసం ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్, తదితర పార్టీలను ఒక్క తాటిమీదకు తీసుకొచ్చి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. పకడ్బందీ ప్రణాళిక తయారు చేయాలని సదరు జేఏసీ భావిస్తుండవచ్చు. 

ఐదేళ్ల టర్మ్ లో ఇప్పటికే సగం ఖర్చయిపోయింది. మిగతా రెండున్నరేళ్ల గ్యాప్ లోనైనా 'యాంటీ కేసీఆర్ ఫ్లేవర్' ని జనంలో పెంపొందించగలిగితేనే బతకడానికి 'బలుసాకులు' దొరుకుతాయన్నది  టీ-అపోజిషన్ అంచనా. రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ఒక్కటిగా నిలబడి కోదండరాం నేతృత్వంలో 'ప్రత్యేక రాష్ట్ర సాధన' కోసం శ్రమించినప్పటి జ్ఞాపకాల్ని వీళ్ళు నెమరు వేసుకుంటున్నారు కూడా. అనేక అంశాల్లో తీవ్రంగా విభేదించడంతో  కేసీఆర్- కోదండరాం మధ్య ఇప్పటికే 'దూరం'  పెరిగింది. ప్యాచ్ అప్ కూడా అసాధ్యమని తేలిపోయింది. ఈ క్రమంలో కోదండరాంనే ముందు నిలబెట్టి తెలంగాణాలో 'మహా కూటమి' ని ఫామ్ చేయవచ్చని కొన్ని పార్టీ ఆఫీసుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కూడా వైఎస్ కు వ్యతిరేకంగా ఇటువంటి 'మహాకూటమి' ప్రయత్నమే జరిగింది. మరి.. ఎన్నో ఢక్కామొక్కీలు తిని, మరెన్నో విజయ ఢంకాలు మోగించి, అపర చాణక్యుడనిపించుకున్న కేసీఆర్... ఈ చప్పుళ్లకు దొరికిపోతారా  అనేది సస్పెన్స్. 

 

 
 
 
Related News

JournalistDiary