India / Entertainment
జై బర్త్‌డేకి అంజలి ఇచ్చిన గిఫ్ట్
66 days ago

తమిళ హీరో జై- అంజలి గురించి కొద్దిరోజులుగా కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ గా మారింది. ఏప్రిల్ 6న జై బర్త్ డే సందర్భంగా అంజ‌లి అతనికి శుభాకాంక్షలు చెబుతూ అతని కోరికలు నెరవేరాలని, తమ రిలేషన్ ఎప్పటికీ ఇలానే వుండాలని ట్వీట్ చేసింది. అంతేకాదు బెలూన్ మూవీ లొకేషన్‌కి వెళ్లి అక్కడ అతనితో స‌ప‌రేట్‌గా కేక్ కట్ చేయించింది.

ఇక అంజ‌లి పుట్టినరోజు సంద‌ర్బంగా జై .. తాను స్వయంగా రాసిన లెట‌ర్‌తోపాటు క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెష‌ల్ విషెస్ అందించాడు. దీనికి వెంట‌నే అంజ‌లి స్పందించి స్పెష‌ల్ డే రోజు నువ్వు అందించిన స్పెష‌ల్ నోట్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది. ఈ హంగామా చూసిన వాళ్లంతా వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు.

 
 
Related News