India / Entertainment
బోయపాటి మార్క్, శాటిలైట్ పంట పండింది
68 days ago

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాల్లో ‘జయ జానకి నాయక’ ఫిల్మ్. బోయపాటి శ్రీను- రకుల్ ప్రీత్‌సింగ్ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఊహించని రేంజ్‌కి వెళ్లింది. తెలుగులో స్టార్ మా ఐదుకోట్లకు శాటిలైట్ రైట్స్‌ని సొంతం చేసుకోగా, ఇక హిందీ డబ్బింగ్ వెర్షన్‌ని 7 కోట్లకు సోనీ నెట్‌వర్క్ దక్కించుకున్నట్టు టాక్.

 

ఇప్పటివరకు ఎలాంటి అంచనాలు లేని మూవీ, ఈ రేటుకి వెళ్లడం ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నార్మల్‌గా బోయపాటి సినిమాలంటే ఇటు యూత్, అటు మాస్‌ని.. ఇంకోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా వుంటుందన్నది నార్త్ ఆడియన్స్ ఆలోచనని, ఈ నేపథ్యంలో ఏడు కోట్లకు వెళ్లిందని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ ఈ విధంగా వెళ్లడం రిలీజ్‌కి ముందు నిర్మాతకు బిగ్ రిలీఫ్.

 

Read Also

 
Related News
JournalistDiary