India / Politics
సైకిల్ గుర్తు మాకే ఇవ్వండి
56 days ago

సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం ఎన్నికల సంఘం వద్దకు చేరింది. సైకిల్ గుర్తు తమకే కేటాయించాలంటూ అఖిలేష్- ములాయం‌సింగ్‌లు ఈసీ గడప తొక్కగా.. తాజాగా సైకిల్ గుర్తు మాకే ఇవ్వాలంటూ జయపద్ర, అమర్‌సింగ్‌లు ఈసీని కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ నేతలిద్దరు, ములాయం, శివపాల్ వెంటపెట్టుకుని ఈసీని కలిశారు. దీంతో సైకిల్ గుర్తుని ఈసీ ఎవరికి కేటాయిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 

ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఖురేషి తన ఒపీనియన్‌ని వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో పార్టీలు అందుకు సంబంధించి అఫిడవిట్లు, ఆధారాలు సమర్పించాలని వెల్లడించారు. తమ తమ మద్దతుదారుల సంతకాలు సేకరించి ఈసీకి ఇస్తే మెజారిటీ ఎటుంటే ఆ వర్గానికి గుర్తుని కేటాయిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ ముగియటానికి నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని, అందులోనూ ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ఈ గుర్తు ఎవరికి ఇవ్వకుండా కొత్త గుర్తులను కేటాయించే ఛాన్స్ వుందని చెబుతున్నారు. 

 

 
 
 
Related News

JournalistDiary