India / Crime
గోవాలో రన్ వేపై జారిన జెట్..
299 days ago

గోవాలో జెట్ ఎయిర్‌వేస్‌కి ఓ ప్రమాదం నుంచి బయటపడింది. డబోలిన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై టేకాఫ్ సమయంలో ఫ్లైట్ జారింది. ఏడుగురు సిబ్బంది సహా 154 మంది ట్రావెలర్స్ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులను కిందకు దించే సమయంలో జరిగిన తోపులాటలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారికి ఎయిర్‌పోర్టులో ట్రీట్‌మెంట్ అందించారు.

మంగళవారం ఉదయం జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 9 W2374 నెంబరు గల విమానం గోవా నుంచి ముంబై వెళ్లాల్సివుంది. రన్‌వేపై టేకాఫ్‌ సమయంలో జెట్‌ ఫ్లయిట్ ఒక్కసారిగా జారిపోయి పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో మధ్యాహ్నం 12:30 గంటల వరకు విమానాశ్రయంను మూసివేశారు అధికారులు.

దీనిపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు మొదలుపెట్టింది. రన్ వే సమయంలో విమానం దాదాపు 360 డిగ్రీ కోణంలో తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నమాట. 

 

 

Read Also

 
Related News
JournalistDiary