India / Entertainment
ఎడారిలో రాయ్‌ల‌క్ష్మీ హంగామా
9 days ago

గ్లామ‌ర్‌తో యూత్‌కి క‌నెక్ట్ అయిన కన్నడ‌ బ్యూటీ రాయ్‌ల‌క్ష్మీ.. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న ‘జూలీ 2’ మూవీకి సంబంధించి ‘కోయి హాస్లాతో హో’ అనే సాంగ్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఎడాదిలో తెరకెక్కించిన ఈ పాటలో రాయ్‌లక్ష్మి మెరిసింది. సాంగ్ ఓకే.. క్రికెటర్‌తో రొమాన్స్ చేసిన సీన్స్‌ మరింత వల్గర్‌గా వున్నాయని అంటున్నారు సినీలవర్స్. బాలీవుడ్‌లోవున్న చీక‌టి కోణంతోపాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా- రాజ‌కీయాలకు మధ్యవున్న రిలేషన్‌ని ఇందులో రివీల్ చేస్తారని యూనిట్ చెబుతున్నమాట. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీవాస్తవ‌, ర‌వికిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ దీపక్ శివ్‌దాసాని.

 

Read Also

 
Related News
JournalistDiary