AP / Politics
అదే జరిగితే.. అలా బిరుదు ఇప్పిస్తా
68 days ago

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీరందిస్తే ఏపీ సీఎం చంద్రబాబుకు ‘అపర భగీరథుడు’ అనే బిరుదు ఇప్పిస్తానని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కె.వి.పి.రామచంద్ర రావు. ఈ ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నానడం సరికాదని, ఈ ఆరోపణను నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆయన అన్నారు.

నిజానికి 2004కు ముందు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడింది చంద్రబాబేనని కేవీపీ ఆరోపించారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు ఏపీ ప్రభుత్వం సకాలంలో పరిహారం చెల్లించిందని వచ్చిన వార్తలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

 

Read Also

 
Related News
JournalistDiary