India / Politics
నా కూతురు చనిపోయే ఉండేది- కమల్‌హాసన్
31 days ago

నటుడు కమల్‌హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? అవుననే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. పళనిస్వామి సర్కార్‌పై ఆయన ఆరోపణలు గుప్పించడంతో నిజమేనని అంటున్నారు అక్కడి నేతలు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓ ట్వీట్ చేశాడు.

తమిళనాడులో ప్రబ‌లుతున్న డెంగీ జ‌రాల‌ను నిరోధించాలని, అందుకోసం ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టాల‌ని కోరాడు. ఒక‌ప్పుడు డెంగ్యూ ఫీవర్‌తో తన కూతురు చ‌నిపోయి ఉండేద‌ని గుర్తు చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుంటే వెంట‌నే త‌ప్పుకోవాల‌ని ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా క‌మ‌ల్ చేస్తున్న ట్వీట్స్ తమిళ‌నాట అంతటా చ‌ర్చనీయాంశంగా మారాయి.

 
 
Related News