World / Entertainment
చరిత్ర సృష్టించిన పాప్ సింగర్
64 days ago

పాప్ సింగర్ కేటి పెర్రీ సోషల్‌మీడియాలో దుమ్ము రేపుతోంది. ఆమె ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లను తాకింది. దీంతో పదికోట్ల మంది ఫాలోయర్లను సొంతం చేసుకున్న ట్విట్టర్ తొలి యూజర్‌గా చరిత్ర సృష్టించింది ఆమె. 32 ఏళ్ల ఈ సింగర్ ఇటీవల 96 అవర్, బిగ్ బ్రదర్ లాంటి ప్రొగ్రామ్‌లతో 190 దేశాల అభిమానులను ఆకట్టుకోవడంతోపాటు ఫాలోవర్ల సంఖ్యను అమాంతం రెట్టింపు చేసుకుంది. అభిమానుల వల్లే అరుదైన మార్క్‌ని చేరుకున్నానని వాళ్లకి ధన్యవాదాలు తెలిపింది.

100 మిలియన్ ఫాలోవర్లతో కేటి టాప్‌లో నిలవగా, 97 మిలియన్లతో పాప్ సింగర్ జస్టిన్ బీబర్, 85 మిలియన్ పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. దీంతో 2009 నుంచి కేటి ప్రతీ ఏటా సాధించిన ఘనతతో చిన్న వీడియోని అభిమానులతో షేర్ చేసుకుంది.

 
 
Related News