India / General
కుంతీదేవిపై వివాదానికి తెరలేపిన మేగజైన్
65 days ago

కేరళలోని ఓ కాలేజీ ప్రచురించిన స్టూడెంట్ మేగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. పాండవుల తల్లి కుంతీదేవిపై
ప్రచురించిన ఐదు లైన్ల పద్యం (చోద్యం) తమ మనోభావాలను గాయపరిచినట్టు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
వాటిపై హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ ఆజాద్, తాము
ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదన్నారు. ఎవరి మనోభావాలు గాయపడి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. మంజేరికి
చెందిన ఎన్ఎస్ఎస్ కాలేజీ ప్రచురించిన మేగజైన్‌లో ఐదులైన్ల పద్యాన్ని ఓ విద్యార్థి రాసుకొచ్చాడు. ఒకవిధంగా చెప్పాలంటే కుంతీదేవి అంతర్గతాన్ని అందులో ప్రస్తావించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

125 ఏళ్ల చరిత్ర కలిగిన తలసేరీలోని బ్రెనన్ కాలేజీ రెండురోజుల కిందట ప్రచురించిన మ్యాగజైన్ కూడా వివాదాస్పద
మైంది. థియేటర్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఓ జంట అసభ్యకర భంగిమలో ఉన్నట్టు ప్రచురించింది.
మ్యాగజైన్‌ను ప్రచురించిన కాలేజీపై ఏబీవీపీ కేసు పెడుతూ సత్వర చర్యలకు డిమాండ్ చేసింది. కాలేజీ తీరుపై దేశ్యాప్తంగా
వెల్లువెత్తుతున్న విమర్శలు వెల్లువెత్తుతుండగా, తాజాగా మరో మేగజైన్ కలకలం రేపుతోంది.

 
 
Related News