India / Entertainment
ఖైదీకి కనకవర్షం.. బాహుబలి క్రాసయినట్టే?
11 days ago

ఖైదీ సినిమా థియేటర్స్‌కి వచ్చేయడంతో ఇప్పుడు అందరిచూపు.. ముఖ్యంగా అభిమానుల కలెక్షన్స్‌పైనే ఫోకస్ పెట్టారు. రిలీజ్‌కు ముందు భారీ హైప్ వచ్చినా, ప్రీమియర్ షోల కలెక్షన్స్ విషయంలో ఓవర్సీస్‌లో మాత్రం బాహుబలి రికార్డుకు ఖైదీ చేరువవుతోందని టాక్. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయానికి అమెరికాలో గ్రాస్‌గా 1.131 మిలియన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇంకా కొన్ని ఏరియాల నుంచి సమాచారం రావాల్సివుంది. అవన్నీ కలుపుకుంటే బాహుబలిని ఖైదీ అధిగమించవచ్చని అంటున్నారు.

ఇప్పటివరకు టాప్‌లోవున్న బాహుబలి (1.364 మిలియన్ డాలర్లు) ప్రీమియర్ ద్వారా వసూళ్లు చేసింది. ప్రీమియర్స్‌లో అత్యధికంగా తెలుగు, ఇతర వెర్షన్లను కలుపుకుని బాహుబలి 1.47 మిలియన్లు కలెక్షన్స్ రాబట్టగా, సర్దార్ గబ్బర్‌సింగ్ 0.64 మిలియన్ల డాలర్ల వసూళ్లతో సెకండ్ పొజిషన్‌కి వచ్చింది. ఈ లెక్కన ఖైదీ.. 1.1 ప్లస్ మిలియన్ డాలర్ల‌తో సర్దార్ గబ్బర్‌సింగ్‌ని బీట్ చేసింది. 

 
 
 
Related News

JournalistDiary