India / Politics
సీఎంకి లెఫ్టినెంట్‌ గవర్నర్ షాక్..
76 days ago

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామికి ఆ రాష్ర్ట లెఫ్టినెంట్‌ గవర్నర్ కిరణ్ బేడి షాకిచ్చారు. ముఖ్యమంత్రి జారీచేసిన ఆదేశాలను ఆమె రద్దు చేశారు. అధికారిక కార్యకలాపాల కోసం సోషల్‌ మీడియాను వినియోగించకుండా నిషేధం విధిస్తూ సీఎం ఆదేశాలు జారీచేశారు. ఆ ఆదేశాలు చెల్లవంటూ కిరణ్‌ బేడీ స్పష్టంచేశారు. 

దీంతో సీఎంకు- గవర్నర్‌కు మధ్య వార్ మొదలైనట్టేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. నిన్నమొన్నటివరకు ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌- సీఎం కేజ్రీవాల్‌ మధ్య ఇలాంటి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు అదే పరిస్థితి మరో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పునరావృతం అవుతోందని అంటున్నారు. అన్నట్లు నారాయణస్వామి కాంగ్రెస్‌ పార్టీ సీఎం కాగా.. కిరణ్‌బేడిని బీజేపీ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించింది. 

 

 
 
 
Related News

JournalistDiary