India / Crime
కిస్ అండ్ రన్ కిలాడీ ఎక్కడ?
256 days ago

కిస్ అండ్ రన్.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో. సరదాగా ఓ ఆకతాయి తీసిన వీడియో ఇది. దారినపోతున్న అమ్మాయిలను, పార్కులో రిలాక్స్ అవుతున్న యువతులను కిస్ పెట్టి ఓ యువకుడు పారిపోతున్న సీన్స్‌తో షూటింగ్ చేసిన వీడియో. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చేష్టలకు పాల్పడ్డవాడిని కఠినంగానే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఆకతాయిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగడంతో.. తననుతాను సుమిత్‌గా పరిచయం చేసుకుంటూ క్షమించమని కోరాడు. తాను తప్పుడు ఉద్దేశంతో వీడియో చిత్రీకరించలేదని, అమ్మాయిల అనుమతితో చేశానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఐనాసరే సుమిత్‌ను వదిలే ప్రసక్తిలేదంటున్నారు పోలీసులు. యువకులూ తస్మాత్ జాగ్రత్త.. సరదాగా కోసం ఇలాంటి పనులు చేసి రిస్క్‌‌‌లో పడొద్దు సుమా! 

 
 
 
Related News
JournalistDiary