India / General
కొచ్చిలో గ్రీన్ మెట్రో, తొలి టిక్కెట్ మోదీకే!
122 days ago

దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రో రైళ్లన్నీ ఒక ఎత్తైతే.. కోచి మెట్రో రైలు ఒక్కటీ ఒక ఎత్తు. ఎందుకంటే.. కేరళలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు మెట్రో రైళ్లతో పోలిస్తే.. కొచ్చి మెట్రో హైఫైగా ఉందంటూ కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి. వాయు, జల, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానిస్తూ నిర్మితమైన కొచ్చి మెట్రో రూట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం ప్రారంభమైంది.

కోచిలోని పది ద్వీపాలను పడవల ద్వారా కలుపుతూ నడిచే వాటర్ మెట్రో ప్రాజెక్టుకు రూ. 819 కోట్లు ఖర్చయింది. అవసరమైన విద్యుత్‌లో 28% సౌరశక్తి ద్వారానే పొందేందుకు ప్రతి స్టేషన్‌పైనా సౌరఫలకాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మొత్తం నాలుగువేల మెట్రో ఫిల్లర్లపై పచ్చని మొక్కల పెంపకాన్ని చేపట్టి.. హరిత తోరణాల్ని తలపించేలా ప్లాన్ చేశారు.

సైట్ సీయింగ్ కోసం వచ్చే ప్రయాణికులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ, ఎక్కువ మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు కల్పించడం లాంటివి కూడా కొచ్చి మెట్రో స్పెషాలిటీలు.

 

Read Also

 
Related News
JournalistDiary