AP and TS / Politics
జగన్ మీద లక్ష్మీపార్వతి సెటైర్!
9 days ago

'లక్ష్మీస్ ఎన్టీయార్' మూవీ మీద వర్మ క్లారిటీనిచ్చేశాడు. దీంతో.. ఆ సినిమా చుట్టూ చర్చ మరింత స్పీడెత్తుకుంది. వైసీపీ బ్యాక్ గ్రౌండ్ వున్న వ్యక్తి ప్రొడ్యూసర్ గా ఎక్స్ పోజ్ కావడంతో దీని చుట్టూ వద్దన్నకొద్దీ రాజకీయ రంగు! జగన్ దీనికి సూడో నిర్మాతగా వ్యవహరిస్తున్నారని, సినిమా కంటెంట్ ద్వారా రాజకీయ లబ్ది పొందే ఆలోచనలో వున్నారని వార్తలొస్తున్నాయి. వీటి మీద క్లారిటీ కోసం ఇప్పుడు వైసీపీలో వున్న లక్ష్మిపార్వతి.. ‘టీవీ1’ నిర్వహించిన న్యూస్‌వాచ్ కార్యక్రమంలో  పాల్గొన్నారు.  వర్మ డైరెక్ట్  చేస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీయార్' మూవీ వెనుక వైఎస్సార్ పార్టీ వుందా అన్న ప్రశ్నకు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు ఆమె.  

సినిమాలకు ఖర్చు పెట్టేంత డబ్బు జగన్ దగ్గర లేదని, ఒకవేళ వున్నా ఆయన ఖర్చు పెట్టబోరని ఆమె కుండ బద్దలుకొట్టేశారు. డబ్బు ఖర్చు పెట్టేవాడే అయితే జగన్ ఈ పాటికే సీఎం అయ్యుండేవాడన్నది ఆమె ఇచ్చిన క్లారిటీ. గత ఎన్నికల్లో ఆయన డబ్బు ఖర్చు పెట్టకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఖర్చు విషయంలోనే పార్టీ అభ్యర్థులకు, అధినేతకు మధ్య డిఫరెన్సెస్ వచ్చాయంటూ వైసీపీలో ఎప్పట్నుంచో ఒక చర్చ నడుస్తోంది. దీనికి.. లక్ష్మి పార్వతి ఇచ్చిన స్టేట్ మెంట్ బలం చేకూర్చినట్లయిందా?

 

Read Also

 
Related News
JournalistDiary