AP / Politics
లక్ష్మీపార్వతి బ్యాక్ ఇన్ న్యూస్! ప్రశాంత్ కిషోర్ పాచికలేస్తారా?
8 days ago
ఇటీవలి కాలంలో తెలుగు రాజకీయాల్లో విపరీతంగా వైరల్  అయిన పేరు లక్ష్మిపార్వతి. కేసీఆర్, చంద్రబాబు, జగన్ ల తర్వాత సోషల్  మీడియాలో ఎక్కువగా ప్రచారం పొందిన లక్ష్మిపార్వతి.. రెండు దశాబ్దాల కిందటి తన ప్రాభవాన్ని గుర్తుకు తెచ్చారు. అప్పట్లో ఎన్టీయార్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి.. తెలుగుదేశం పార్టీ గమనం మీద పెనుప్రభావం చూపిన లక్ష్మి పార్వతి.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే  అంతటి పబ్లిసిటీని రాబట్టుకుంది. 
  
లక్ష్మీస్ ఎన్టీయార్.. బాలయ్య ఎన్టీయార్..! తెలుగుతేజం ఎన్టీయార్ మీద రెండు బయోపిక్స్ ! దాదాపు ఒకే సమయంలో రిలీజ్ అయ్యే చాన్సులూ ఎక్కువే! సరిగ్గా ఎన్నికల సీజన్లో ఈ 'బయోపిక్ రగడ' పీక్స్ కెళ్లవచ్చన్న లెక్క కూడా ఒకటుంది. ఈ క్రమంలో తెలుగు పాలిటిక్స్ మీద ఈ సినిమాలు ఎంతోకొంత ప్రభావం చూపడం గ్యారంటీ! ఈ రెండు సినిమాల్లోనూ ఎన్టీయార్ భార్యగా లక్ష్మీపార్వతి పాత్ర మీదే ఎక్కువ కాన్సం ట్రేషన్. లక్ష్మీపార్వతిని ఎలా చూపిస్తారు.. లక్ష్మిపార్వతి రోల్ ఎవరితో వేయిస్తారు లాంటి సందేహాలు.. ఆమెకు వద్దన్నకొద్దీ పబ్లిసిటీని పెంచేస్తున్నాయి. 
 
టీడీపీని చంద్రబాబు టేకోవర్ చేసిన తర్వాత 'ఎన్టీయార్ టీడీపీ' పేరుతో కొత్త పార్టీ పెట్టిన లక్ష్మిపార్వతి.. ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. రాజకీయంగా నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తరంతో పాటు రాజకీయ పరిస్థితులు కూడా మారిన క్రమంలో జగన్ పెట్టిన వైసీపీలో చేరిపోయారు. పార్టీ పోస్ట్ ఏమీ లేకపోయినా.. వైసీపీ ప్రతినిధిగా గట్టిగా మాట్లాడుతూ మీడియాలో చురుగ్గా వ్యవహరించేవారు. కానీ.. పార్టీలో ఆమెకు తగిన పదవీ, ప్రాధాన్యం దొరకలేదు. జగన్ దృష్టిలో లక్ష్మీపార్వతి 'వెయిట్' ఎంతన్న ఖచ్చితమైన లెక్క కూడా లేదు. అందుకే ఆమె సేవల్ని పరిమితంగానే వాడుకుంది పార్టీ 'యాజమాన్యం'. 
 
కట్ చేస్తే.. ఇప్పుడు లక్ష్మిపార్వతి అనే ఎలిమెంట్ కమర్షియల్ గా బరువెక్కింది. ఆమె పేరుతో పాటు ఆమెలో వున్న 'యాంటీ చంద్రబాబు' ఫ్లేవర్ పార్టీకి 'ప్లస్' అయ్యే అవకాశం ఏర్పడింది. వైసీపీలో లక్ష్మిపార్వతికి సహజంగానే ప్రాధాన్యత పెరుగుతోంది. మంచి మాటకారిగా ఆమెకున్న టాలెంట్ ని ఈ సమయంలో మరింత  ఎక్కువగా ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తుండొచ్చు. సో.. లక్ష్మిపార్వతి సబ్జెక్ట్ ని పార్టీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎలా మలుచుకుంటారో చూడాలి!
 

Read Also

 
Related News
JournalistDiary