AP and TS / Entertainment
‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’మూవీ ఫస్ట్‌లుక్
23 days ago

ఎన్టీఆర్ బయోపిక్‌‌ను డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’మూవీ ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ఇందులో ఓ మహిళ బయట చెప్పులు విడిచి ఇంటిలోకి ప్రవేశిస్తూ కనిపించారు. లోపల మరోవ్యక్తి కాషాయ రంగు దుస్తులు ధరించి, కుర్చీలో ఉన్నారు. ఆ మహిళ..  లక్ష్మీపార్వతిగా, లోపలున్న వ్యక్తి ఎన్టీఆర్‌ అని అంటున్నారు సినీలవర్స్.

ఈ లుక్ ఆధారంగా చేసుకుని స్టోరీలు అల్లేసుకుంటోంది వెబ్ మీడియా. ఇంతవరకు బాగానేవుంది. వర్మ.. తాను చేయబోయే సినిమాల గురించి ఎప్పుడు ప్రకటన చేస్తాడో తెలీదు.  కాకపోతే  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ విషయంలో స్టేట్‌మెంట్ కొద్దిరోజులకే ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయడం విశేషం. వచ్చేఏడాది చివరలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు డైరెక్టర్ వర్మ.

 

Read Also

 
Related News
JournalistDiary