India / Sports
క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన లలిత్‌మోదీ
69 days ago

క్రికెట్‌ అడ్మినిస్ట్రేషన్‌కు గుడ్‌బై చెప్పేశాడు ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీ. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపాడు. ఈ నేపథ్యంలో మూడు పేజీల లేఖను బీసీసీఐకి పంపాడు. మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌, ప్రస్తుతం విదేశాల్లో వుంటున్నాడు. నాగ్‌పూర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవితోపాటు క్రికెట్‌ సంబంధాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విటర్ ద్వారా పేర్కొన్నాడు. వచ్చే తరాలకు అవకాశం ఇవ్వాలని భావించి వీడ్కోలు పలుకుతున్నానని తెలిపాడు. 

 

Read Also

 
Related News
JournalistDiary