India / Crime
ఈడీ చేతికి చిక్కిన లాయర్
233 days ago

భారీగా బ్లాక్‌మనీ వుందన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన లాయర్‌ రోహిత్‌ టండన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం సాయంత్రం అరెస్టు చేసింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆయన రూ.70 కోట్ల లావాదేవీలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల కిందట రోహిత్ ఇంటిపై అధికారులు సోదాలు చేశారు. దాదాపు రూ.125 కోట్లు బయటపడ్డాయి... డిసెంబర్‌ 10న మరోసారి అధికారులు సోదాలు చేపట్టగా రూ.14 కోట్లు వెలుగుచూశాయి.. అందులో కొత్తవి 2000 నోట్లు రెండు కోట్లు.

ఈసారి టండన్‌ ఇంట్లో లేరుకానీ, ఇళ్లంతా సీసీకెమెరాలుండడంతో ఆయన తన మొబైల్‌ను సీసీ కెమెరాకు అనుసంధానించి వుండడంతో  సోదాలు జరిగిన తీరుని గమనించినట్టు వార్తలొచ్చాయి. లభించిన మనీ గురించి టండన్‌ను ప్రశ్నించగా.. కొంత భాగానికి లెక్క ఉందని, మరి కొంత తన క్లయింట్‌‌దని చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం టండన్‌ని విచారిస్తున్న ఈడీ, కీలక సమాచారం వెలుగులోకి వస్తుందా? ఇంతకీ టండన్ క్లయింట్ ఎవరు? అతడ్ని కూడా రేపోమాపో ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమన్నది ఢిల్లీ సమాచారం. 

 
 
Related News