World / Crime
విమానం హైజాక్.. ట్రావెలర్స్ రిలీజ్.. కాకపోతే
27 days ago

బ్రేకింగ్ న్యూస్..  లిబియాలో విమానం హైజాక్ అయ్యింది. ఆఫ్రిక్వీయ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏ-320 విమానం ట్రిపోలి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దాన్ని హైజాక్ చేశారు. విమానంలో సిబ్బంది సహా 118 మంది ట్రావెలర్స్ ఉన్నారు. హైజాక్ విషయం తెలియగానే విమానాన్ని అధికారులు మాల్టా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తమ డిమాండ్లు తీర్చకపోతే విమానాన్ని పేల్చేస్తామంటూ హైజాకర్లు.. బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే మాల్టా ఎయిర్‌పోర్టులో హైఅలెర్ట్ ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.

ఇటు విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇదిలావుండగా, మాల్టా అధికారులు హైజాకర్లతో చర్చలు జరిపిన తర్వాత ప్రయాణికులందరినీ విడిచిపెట్టినట్లు మల్టా ప్రధాని ప్రకటించారు. ఐతే, విమానం సిబ్బందిని మాత్రం బందీలుగానే ఉంచారు. అయితే హైజాకర్‌ డిమాండ్లు ఏమిటనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. మరోవైపు విమానం హైజాక్‌ కారణంగా మాల్టా ఎయిర్‌పోర్టులో పలు విమానాలు దారి మళ్లించగా, మరి కొన్నింటిని రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.

 
 
 
Related News

JournalistDiary