India / Entertainment
లండన్‌ బాబులతో స్వాతి
69 days ago

కలర్స్ స్వాతి- రక్షిత్ జంటగా టాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ ‘లండన్ బాబులు’. ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్‌గా
చిత్రీకరణ జరిగిపోవడం, టీజర్‌ని విడుదల చేయడం కూడా జరిగిపోయింది. అరనిమిషం నిడివిగల టీజర్‌లో స్వాతిని
హైలైట్ చేశాడు డైరెక్టర్. కేవలం ఒక్క డైలాగ్‌తో సరిపెట్టాడు.

టీజ‌ర్ క‌లర్‌ఫుల్‌గా ఉండ‌డంతో మూవీ‌పై అంచ‌నాలు పెరిగాయి. శ్యామ్ కెనాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్న ఈ చిత్రానికి మారుతి టాకీస్ బేన‌ర్ పై మారుతి నిర్మిస్తున్నారు. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగావున్న క‌ల‌ర్స్ స్వాతి తెలుగులో కాస్త జోరు త‌గ్గించింది. 2015లో విడుద‌లైన త్రిపుర‌ తర్వాత ఆమె చేస్తున్న ప్రాజెక్ట్ ఇది.

 
 
Related News