AP and TS / Entertainment
‘బిగ్‌బాస్’లో తెగిన ‘కత్తి’
8 days ago

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం మహేష్ కత్తి ఎలిమినేట్ అయ్యాడు. వస్తూ.. వస్తూ.. బిగ్ బాస్ ‘బాంబు’ను హౌస్‌లోని పార్టిసిపెంట్స్‌లో ఒకరైన ఆదర్శ్‌పై విసిరాడు. వారం రోజులపాటు హౌస్‌లోని అందరి ప్లేట్లు, గ్లాసులు కడగాలని అతనికి ‘పనిష్మెంట్’ ఇచ్చాడు. అనంతరం హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మహేష్ కత్తి సందడి చేయడం విశేషం. హౌస్‌లోని పార్టిసిపెంట్స్‌కి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చిన మహేష్ కత్తి.. ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు.

లోనోవాలాలోని బిగ్‌బాస్ హౌస్ నుంచి ముంబై ఎయిర్ పోర్టు, అక్కడి నుంచి ఆయన... ప్లేన్‌లో నగర విమానాశ్రయానికి చేరగానే, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు చాలామంది పోటీలు పడ్డారు. 27 రోజులపాటు మహేష్ కత్తి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండడంతో వీరంతా ఆయనను సులభంగా గుర్తుపట్టారు. ఊహించని ఈ అనుభవానికి మహేష్ కత్తి ఆశ్చర్యపోయారు. సినీ విమర్శకుడిగా బిగ్‌బాస్ షోకి వెళ్ళిన తాను సెలబ్రిటీగా తిరిగిరావడం ఆనందంగా ఉందని, హౌస్‌లో తనకు కలిగిన అనుభవాలపై ఓ పుస్తకం రాస్తానని మహేష్ కత్తి తెలిపారు.

 
 
Related News