AP / Politics
జగన్‌పై భూమా నాగిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
110 days ago

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ అధినేత జగన్‌పై ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జగన్‌ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నానన్న ఆయన, వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పార్టీ మారితే జగన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 

వైఎస్‌ హయాంలో జరిగిన జలయజ్ఞంలో భారీగా అక్రమాలు జరిగాయని, తాను పీఏసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆధారాలన్నీ సేకరించానని భూమా చెప్పారు. జలయజ్ఞంలో జరిగిన అక్రమాలపై బహిరంగ చర్చకు ఎవరైనా రావచ్చునని, పట్టిసీమ ద్వారా రాయలసీమకు చాలా ప్రయోజనాలున్నాయని చెప్పుకొచ్చారాయన. రైతులను రెచ్చగొట్టేందుకే జగన్‌ రైతుయాత్ర చేస్తున్నారని విమర్శించిన భూమా, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ చాలా గొప్పదని కితాబిచ్చారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమానాగిరెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

 

 
 
 
Related News

JournalistDiary