AP / Politics
నేను బతికే వున్నా : రోజా
71 days ago

సోషల్ మీడియా వేదికగా వికృతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రతిష్టల మీద దెబ్బకొట్టడం పాత పధ్ధతి. వ్యతిరేకులకు బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించేదాకా ముదిరిపోయింది ఈ ధోరణి. సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రకమైన పైత్యానికి దొరికిపోయారు.

సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వ్యతిరేక వార్తలపై కన్నెర్ర చేసిన రోజా, తాను చనిపోయానంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫొటోలను పోస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్న తన రాజకీయ శత్రువుల్ని వదిలిపెట్టబోనని ఆమె హెచ్చరించారు. అసెంబ్లీలో తాను దీక్షకు కూర్చున్నప్పటి ఫోటోలను మార్ఫ్ చేసి.. ఇలా 'చావుకబుర్ల'కు వాడుకుంటున్నారని.. వీరి మీద చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని రోజా చెప్పుకొచ్చారు.

 

Read Also

 
Related News
JournalistDiary