Telangana / Politics
అలాచేస్తే.. మీకు చీరలే..చీరలక్కా..
287 days ago

నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ అసెంబ్లీలో సందడి చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు కవిత. అంతేకాదు, అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న హ్యాండ్లూమ్ స్టోర్ లో పోచంపల్లి చీరలు కొని పద్మాదేవేందర్ రెడ్డికి బహుకరించారు. ఈ క్రమంలో వాళ్లిద్దరిమధ్య ఆసక్తికర చర్చ సాగింది.

‘నా పుట్టినరోజు నాడు పురుషులు ఎవరూ గిఫ్టులు ఇవ్వలేదు. మా ఆడబిడ్డ వచ్చి... చీర కొనిచ్చారు’ అని పద్మాదేవేందర్ రెడ్డి వ్యాఖ్యానించగా, కవిత నవ్వుతూ... ‘అక్కా! మీరు సభలో చైర్‌పై ఉన్నప్పుడు చీర కొట్టు..మైక్‌ పట్టు అనే స్కీం పెట్టండి. అప్పుడు మీకు చీరలే... చీరలు’ అంటూ జోక్ చేశారు.

దీనికి బదులుగా డిప్యూటీ స్పీకర్‌ స్పందిస్తూ.. ‘సభలో మైకు ఇస్తే చీర ఇస్తామని సభ్యులు నేరుగా చెబితే బాగుండదు. నాకు అర్థమయ్యేలా సైగ చేస్తే చాలు’ అని సరదా కౌంటరిచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో డిప్యూటీ స్పీకర్‌ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary