World / Sports
ఈ చిన్నారి ఎవరో తెలుసా?
64 days ago

కొద్దిగంటల్లో భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ పోరు మొదలుకానుంది. టైటిల్ దక్కించుకోవాలని
ఇరుజట్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ నిమగ్నమయ్యారు. వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా
భావిస్తుండగా, చిరకాల ప్రత్యర్థిపై గెలిచి ఛాంపియన్స్‌ ట్రోఫీని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది పాక్.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా
సర్కులేట్ అవుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరోకాదు.. పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కొడుకు అబ్దుల్లా. ఓ హోటల్‌లో
ఇరుజట్లు దిగినప్పుడు తీసిన పిక్.. ఎట్ ప్రజెంట్ ఇరుదేశాల్లో చక్కర్లు కొడుతోంది. మైదానం వరకే ఇరుదేశాల మధ్య పోటీ
అని, బయట కాదన్న భావన కలిగించేలా ఉందని అంటున్నారు క్రికెట్ లవర్స్. ఈ లెక్కన ఇరుదేశాల మధ్య మంచి రిలేషన్స్ వున్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.

 
 
Related News