AP and TS / Entertainment
''వర్మకు మెంటల్.. ఇద్దరు డాక్టర్లకు చూపించాలి''
66 days ago

డ్రగ్ ఎపిసోడ్ నేపథ్యం.. ఆర్జీవీకి- ఆర్టిస్టుల సంఘానికి మధ్య చిచ్చు పెట్టేసింది. వర్మ మీద ఒంటికాలి మీద లేస్తోంది టాలీవుడ్ మా. సినిమా వాళ్ళను మాత్రమే అతిగా ఎక్స్ పోజ్ చేస్తోందంటూ మీడియాను, పోలీస్ డిపార్ట్ మెంట్ ను దుయ్యబట్టిన వర్మ.. మొదట్లో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ.. క్రమంగా ఆయన వైఖరికి దూరంగా జరుగుతోంది తెలుగు సినీ పరిశ్రమ. సిట్ చీఫ్ అకున్ సభర్వాల్ ను అందరూ బాహుబలితో పోలుస్తున్నారని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 సినిమా తీయాలని రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్.. వాతావరణాన్ని సడన్ గా వేడెక్కించింది. పోలీస్ అధికారుల్ని రెచ్చగొట్టడం మనకే మంచిది కాదంటూ మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీ రాజా అప్పట్లో వర్మకు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు.

 

తెలుగు చిత్రసీమలో కొన్ని డ్రగ్స్ పురుగులు ఉన్నమాట వాస్తవమేనని, వాళ్లను మేమే దారిలో పెట్టుకుంటామని, ఇంతవరకూ జరిగిన డిస్ట్రబెన్స్ కి పరిశ్రమ బాధ పడుతోందని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది మా. మూవీ ఆర్టిస్టుల సంఘం, ఫిలిం ఛాంబర్ సంయుక్తంగా రాసిన ఈ లేఖ మీద కూడా రామ్ గోపాల్ వర్మ అప్పుడే తీవ్రంగా స్పందించారు. ఈ లేఖ ద్వారా.. తాము చెయ్యని తప్పును ఒప్పుకున్నట్లయిందని, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని వర్మ సోషల్ మీడియాలో కామెంటరీ ఇచ్చేశారు. దీంతో.. మూవీ ఆర్టిస్టుల సంఘం వర్మను ఎట్టిపరిస్థిల్లోనూ ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒక్కరు కాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ మా అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ఒక టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో వర్మను, వర్మ కామెంట్లను ఏకిపారేశాడు శివాజీరాజా.

 

Read Also

 
Related News
JournalistDiary