AP and TS / Entertainment
మహేష్‌తో అసెంబ్లీలో చర్చిస్తున్న పోసాని
27 days ago

కనిపిస్తున్న ఫోటో అసెంబ్లీలో చర్చ. ఇందులో నటుడు, రైటర్ పోసాని కృష్ణమురళి వున్నాడు. వున్నట్లుండి ఆయన అసెంబ్లీలో ఏంటి? ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? అన్నది తెలుసుకోవాలంటే స్టోరీలోకి ఓసారి వెళ్లాల్సిందే! మహేష్‌బాబు- కొరటాల శివ కాంబోలో రానున్న ఫిల్మ్ ‘భరత్ అనే నేను’. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది. పిక్‌లో చూస్తున్నది అసెంబ్లీ సెట్.

దాదాపు రెండు కోట్ల రూపాయలతో అన్నపూర్ణ స్టూడియోలో రెడీ చేశారు. సభలో చర్చ జరుగుతున్న సందర్భంలోని ఈ సన్నివేశం. ఇంతకీ అసెంబ్లీలో మహేష్‌బాబు ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు హార్డ్‌కోర్ అభిమానులు. అసెంబ్లీ సన్నివేశాలు 40 రోజులపాటు షూట్ చేశాడట డైరెక్టర్ కొరటాల శివ. ఈ మూవీ షూటింగ్ మొదలు తొలిసారి పిక్ బయటకు రావడంతో ప్రిన్స్ అభిమానులు ఫుల్‌జోష్‌లో వున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary