India / Crime
పీకలదాకా తాగి.. సీసా నెత్తిమీద కొట్టుకున్నాడు
293 days ago

న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలామంది హ్యాపీగా ఎంజాయ్ చేయడం మనం చూస్తాం.. అది ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో అవ్వొచ్చు. కానీ ఇక్కడ సీన్ అందుకు రివర్స్. పీకల వరకు తాగిన ఓ వ్యక్తి, పట్టరాని కోపంతో ఓ బీరుబాటిల్‌‌తో తన తలను తానే పగలకొట్టుకున్నాడు. చివరకు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. 

పంజాబ్‌లోని లుథియానాకు చెందిన 30 ఏళ్ల స్మాల్ బిజినెస్‌మేన్ దీపక్‌టాండన్. న్యూఇయర్ సందర్భంగా తన క్లోజ్‌ఫ్రెండ్స్ తో కలిసి న్యూఢిల్లీలోని హాజ్‌ఖాస్ విలేజ్‌లోని ఓ పబ్‌కి వచ్చాడు. అందరూ ఉత్సవాల్లో మునిగితేలగా దీపక్ మాత్రం పీకల వరకు మద్యం తాగాడు.. ఆపై తనకు నచ్చిన పాట పెట్టాలని నిర్వాహకులను డిమాండు చేశాడు. ఈ విషయమై కొందరితో గొడవపడ్డాడు. చివరకు పట్టరాని కోపంతో ఓ బీరుబాటిల్‌ను తన తలపైనే పగల గొట్టుకున్నాడు. ఈ ఘటనతో బార్‌లోవున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. కుప్పకూలాడు దీపక్.. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ దీపక్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దీపక్ ఇంట్లో విషాదం అలముకుంది. 

 

Read Also

 
Related News
JournalistDiary