AP and TS / Entertainment
మూవీస్‌కు మంచు మనోజ్ గుడ్ బై. అయితే..
128 days ago

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఇక ముందు ఎలాంటి సినిమాలు చేయనని చెప్పి సినీ
లవర్స్‌కి షాకిచ్చాడు. ప్రస్తుతం ‘ఒక్కడు మిగిలాడు’లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో ఫిల్మ్స్ చేస్తున్నాడు. అవి పూర్తి అయ్యాక ఎలాంటి సినిమాలు చేయనని ప్రకటించాడు. వున్నట్లుండి మనోజ్‌ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించలేదు. అయితే, మనోజ్ ట్వీట్ చేయగానే భారీగా రిప్లైలు, రీట్వీట్స్ వచ్చిపడ్డాయి. అనేకమంది మనోజ్ నిర్ణయంపై తమ కామెంట్స్ పోస్ట్ చేశారు.  

తన ప్రకటన వైరల్ కావటంతో కొద్దిసేపటికి మనోజ్ తన ట్విట్టర్  అకౌంట్ నుంచి నటనకు గుడ్ బై చెపుతున్నట్టుగా చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఇది కేవలం తన సినిమా ప్రమోషన్ కోసం చేసిన పనే అని ఒప్పుకున్నాడు. ఇంతపెద్దమొత్తంలో రియాక్షన్స్ వస్తాయని ఊహించలేదన్నాడు.  అస‌లు నా ఉద్దేశం రాబోవు సినిమా గురించి నా స్టైల్లో చెప్పాల‌నుకోవ‌డం. కాని అది బెడిసికొట్టింది. స‌రిగ్గా వ‌ర్కవుట్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితులు కొంచెం చ‌ల్లారాక నా త‌దుప‌రి చిత్రం ప్రక‌టించాల‌ని భావిస్తున్నాను.. ఓం శాంతి అంటూ ఉదయం చేసిన ట్వీట్ పై క్లారిటీ ఇచ్చాడు మనోజ్.   మొత్తానికి మనోజ్ ట్వీట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి.  ‘మేజర్‌ చంద్రకాంత్‌’లోచైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన మనోజ్, ఆ తర్వాత హీరోగా దొంగ దొంగది, శ్రీ, ప్రయాణం, మిస్టర్‌ నూకయ్య, వేదం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే!

 

Read Also

 
Related News
JournalistDiary