India / Crime
బాబుకు కొత్త తలనొప్పి
291 days ago

'ఎపి సిఎం చంద్రబాబును మావోయిస్టులు టార్గెట్ చేశారు.. మీ సీఎం భద్రత విషయంలో అలర్ట్ గా ఉండండి.. ఎపి భవన్ దగ్గర మావోయిస్టులు రెక్కీ కూడా నిర్వహించారు'. ఇది వారంరోజుల క్రితం చంద్రబాబు హస్తిన పర్యటన సమయంలో ఢిల్లీ పోలీసులు ఎపి భవన్ భద్రతా సిబ్బందికి చేసిన హెచ్చరిక. మల్కాన్ గిరి ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగా మావోలు చంద్రబాబుని టార్గెట్ చేశారని ఇంటిలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారనే విషయం పక్కనపెడితే, చంద్రబాబు కదలికల మీద మావోల కన్నుందన్నవార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా సెక్కూరిటీ సెర్చ్ ఆపరేషన్లో 200  జెలిటిన్ స్టిక్స్ దొరికాయి. అనంతపురం సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బుక్కపట్నం, కొత్తచెరువు మధ్య ఇవి బయటపడ్డాయి. కాసేపట్లో ఇదే మార్గంలో చంద్రబాబు రావాల్సింది.  ఇది మావోల కుట్రలో భాగమేనని భావిస్తున్నారు. 

 

Read Also

 
Related News
JournalistDiary